తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల తహసీల్దార్ కార్యాలయం వద్ద.. అనూహ్య ఘటన.. సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. భూ వివాదం కారణంగా తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతాన్ని ఖండిస్తూ... రెవెన్యూ సిబ్బంది నిరసనకు దిగారు. అదే సమయంలో పట్టాదారు పాసుపుస్తకం కోసం వచ్చిన ఓ మహిళ వారిని నిలదీసింది. తన వద్ద తీసుకున్న లంచం డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. కార్యాలయం చుట్టూ తిరగటం వల్ల ఇప్పటి వరకూ ఎంతో డబ్బు ఖర్చయిపోందని ఆవేదన చెందింది. అయినప్పటికీ... పనులు పూర్తికాలేవని సిబ్బందిపై మండిపడింది. ఏం సమాధానం చెప్పాలో తెలియని రెవెన్యూ సిబ్బంది ధర్నా విరమించి లోపలికి వెళ్లిపోవాల్సివచ్చింది.
'లంచాలు తిని.. ధర్నాలు చేస్తున్నారా?' - విజయారెడ్డి సజీవదహనంపై నిరసన వ్యక్తం చేస్తున్న రెవెన్యూ సిబ్బందిని నిలదీసిన మహిళ
తెలంగాణలో తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనంపై నిరసన వ్యక్తం చేస్తున్న రెవెన్యూ సిబ్బందిని ఓ మహిళ గట్టిగా నిలదీసింది. తీసుకున్న లంచం సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ పట్టుబట్టింది. సమాధానం చెప్పలేక ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.
yadadri bribe mro office
TAGGED:
yadadri bribe mro office