ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాఫీగా హైదరాబాద్​ మెట్రో సేవలు - passengers travveling in hyderabad metro news

ఈనెల 7 న హైదరాబాద్​లో పునఃప్రారంభమైన మెట్రో సేవలు వారం రోజులుగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తొలివారం మూడు కారిడార్లలో గరిష్ఠంగా రోజూ 35 వేల మంది రాకపోకలు సాగించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కొందరు ప్రయాణికులకు మెట్రో సిబ్బంది కౌన్సిలింగ్​ ఇస్తున్నట్లు ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు.

hyderabad-metro-servics
hyderabad-metro-servics

By

Published : Sep 14, 2020, 12:22 PM IST

హైదరాబాద్​ నగరంలో ప్రస్తుతం మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈనెల 7 నుంచి ఇవి అందుబాటులోకి రాగా ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఎక్కువ మంది వినియోగించుకునేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తొలి వారం మూడు కారిడార్లలో గరిష్ఠంగా రోజూ 35 వేల మంది రాకపోకలు సాగించారు. ఈవారం నుంచి ప్రయాణికుల సంఖ్య పెరగవచ్చని.. ప్రయాణికులు లక్షకు చేరవచ్చనే అంచనాలో ఉన్నారు.

యువత, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు ప్రయాణికులు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించడంతో కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. తొలివారం అంతా సాఫీగా సాగిపోయిందని.. రైళ్లలో, స్టేషన్లలో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చర్యలను పెంచనున్నట్లు తెలిపారు.

1000 ట్రిప్పులు.. లాక్‌డౌన్‌ ముందు నిత్యం తిరిగేవి

680 ట్రిప్పులు.. ప్రస్తుతం తిరుగుతున్నవి

ఉదయం 7 నుంచి రాత్రి 9మెట్రో ప్రయాణ సమయం

  • రోజువారీ సగంమందికి పైగా మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. సాధారణ రోజుల్లో 2 లక్షల మందికి పైగా రోజూ ఉపయోగించేవారు. ఇప్పుడు ఇందులో పదిశాతం మాత్రమే ఎక్కుతున్నారు.
  • జేబీఎస్‌-ఫలక్‌నుమా మార్గంలో 3 నుంచి 5వేల లోపే ప్రయాణిస్తున్నారు.
  • నాగోల్‌- రాయదుర్గం మార్గాన్ని గతంలో ఐటీ ఉద్యోగులు ఎక్కువ వినియోగించేవారు. వారు ఇప్పుడు ఇంటి నుంచే పనిచేస్తున్నారు.
  • మెట్రో ఎక్కే వరకు మాస్క్‌ ధరించి కొందరు ఆ తర్వాత తీసేస్తున్నారు. లోపల సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్క్‌ తీయొద్దు.
  • ఇతరులు చేతితో తాకే అవకాశం ఉన్న వేటినీ తాకొద్దని సిబ్బంది సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆన్​లైన్​ పాఠాలతో ఫోన్ బిల్లుల మోత!

ABOUT THE AUTHOR

...view details