రాష్ట్రంలో లౌక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. రేషన్ కార్డు ఉన్న వారికి కిలో పప్పు ఉచితంగా ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్ 4న రూ.వెయ్యి అందిస్తామని చెప్పారు. గ్రామ వాలంటీర్లు ఇంటికెళ్లి నగదును అందజేస్తారని పేర్కొన్నారు. ఈనెల 29నే రేషన్ సరకులు అందిస్తామని స్పష్టం చేశారు.
జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా విజృంభించే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉన్నవాళ్లు వెంటనే 104కు ఫోన్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చే వారిపై పోలీసులు నిఘా పెట్టాలని ఆదేశించారు. మరోవైపు నిత్యావసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ను ఆమోదిస్తామని...అసెంబ్లీని కూడా కొన్ని రోజులపాటే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.