ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో ఒక టీచర్​.. ఒక విద్యార్థి.. ఆ కథేంటో తెలుసా..?

అనగనగా ఒక బడి... అందులో ఐదు తరగతులు... కానీ అక్కడ ఎలాంటి అల్లరీ వినిపించదు. ఎటువంటి సందడి ఉండదు. విద్యార్థుల కేకలు... టీచర్ల అరుపులు ఏమీ ఉండవు. ప్రార్థనల పాటలు... పిల్లల ఆటలు... ఏమీ కన్పించవు. ఎందుకంటే అక్కడ ఉండేది ఒకే ఒక్క విద్యార్థి.... నిజమండీ బాబూ. తెలంగాణలోని ఆదిలాబాద్​లో ఆ పాఠశాల కథేంటో మనమూ తెలుసుకుందామా..!

తెలంగాణలో ఒక టీచర్​.. ఒక విద్యార్థి.. ఆ కథేెంటో తెలుసా..?
తెలంగాణలో ఒక టీచర్​.. ఒక విద్యార్థి.. ఆ కథేెంటో తెలుసా..?

By

Published : Nov 28, 2019, 8:26 AM IST

Updated : Nov 28, 2019, 8:50 AM IST

తెలంగాణలో విచిత్ర పరిస్థితి.. ఒకే విద్యార్థికి పాఠాలు చెబుతున్న టీచర్​

తెలంగాణలోని ఆదిలాబాద్​ జిల్లా తలమడుగు మండలం ఝరి పంచాయతీ పరిధిలోని శేరుగూడ ప్రాథమిక పాఠశాల పరిస్థితి వినటానికీ, చూడటానికి ఎంతో విచిత్రం. ఆ పాఠశాలలో ఉన్నది ఒకే ఒక్క విద్యార్థి. ఒక్కరే ఉపాధ్యాయురాలు. ఉన్న ఆ ఒక్క చిన్నారికే ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతున్నారు. ఇక్కడ ఒకటో తరగతి చదువుతున్న ఆ ఏకైక విద్యార్థిని పేరు వైష్ణవి. ఉపాధ్యాయురాలి పేరు అనసూయ.

ఇంకా ఆసక్తికర విషయమేమిటంటే... నిత్యం టీచరమ్మే విద్యార్థినిని స్వయంగా బడికి తీసుకొచ్చి మరీ... చదువు చెబుతోంది. ఈ గ్రామంలో దాదాపు 29 కుటుంబాలు ఉండగా... జనాభా 168 మంది ఉంటారు. వైష్ణవి తప్ప... మిగతా విద్యార్థులంతా ఉమ్రి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు.

Last Updated : Nov 28, 2019, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details