ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: గొర్రెకుంట బావిలో మరో మూడు మృతదేహాలు!

తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ‌ జిల్లాలో వలస కూలీలు మృతి చెందిన గొర్రెకుంట బావిలో ఇవాళ మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు ఆ బావిలో ఏడు శవాలు దొరికాయి.

one more dead body
గొర్రెకుంట బావిలో మరో మూడు మృతదేహాలు

By

Published : May 22, 2020, 10:48 AM IST

తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బావిలో ఈ రోజు ఉదయం మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న గొర్రెకుంటలోని బావిలో 4 మృతదేహాలను కనుగొన్న పోలీసులు... వారు పశ్చిమ బంగాల్​కు చెందిన భార్యా, భర్త వారి కూతురు, మనవడిగా గుర్తించారు.

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిని పోలీసులు తెలిపారు. 20 ఏళ్ల క్రితం బంగాల్‌ నుంచి వచ్చి వరంగల్‌లో స్థిరపడిన కుటుంబమని స్థానికులు తెలిపారు. లాక్​డౌన్ కారణంగా రెండు నెలల నుంచి పనులు లేవని... అప్పటి నుంచి గోదాంలోనే గోనే సంచులు కుడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. మొన్న సాయంత్రం కూడా వీరు పనికి వచ్చారని... నిన్న ఉదయం నుంచి కనిపించకపోవడంతో అన్ని చోట్ల వెతకగా... బావిలో కనిపించారని తెలిపారు.

ఎన్నో అనుమానాలు...

అక్కడే పని చేస్తున్న బీహారి యువకులు సైతం కనిపించట్లేదని... వారికి ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉన్న అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన మూడు మృతదేహాలు ఎవరివి అనే దానిపై విచారణ చేపట్టారు. ఆరు, ఏడు మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా ఉబ్బిపోయాయని పోలీసులు తెలిపారు. ఇవన్నీ సామూహిక హత్యలా? సామూహిక ఆత్మహత్యలా అనే విషయం తెలియాల్సి ఉంది.

మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్​ వచ్చాక మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది. ఇంకా మృతదేహాలు ఉండవచ్చనే అనుమానంతో వరంగల్ విపత్తు నిర్వహణ బృందం సభ్యులు బావిలోని నీటిని పూర్తిగా తోడేస్తున్నారు. ఈ ఘటన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించి... తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:విశాఖ దుర్ఘటనపై కేంద్ర రసాయన నిపుణుల కమిటీ పరిశీలన

ABOUT THE AUTHOR

...view details