మూగ అమ్మాయి గీత తమ కూతురేనంటూ తెలంగాణ రాష్ట్రంలోని మరో కుటుంబం ముందుకొచ్చింది. పెద్దపల్లి జిల్లాకి చెందిన బొల్లి స్వామి కుటుంబం గీత తమ బిడ్డే అంటూ విలపిస్తున్నారు. దశాబ్దం కింద తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన గీత కోసం ఇప్పటికే చాలా కుటుంబాలు వచ్చాయి. వారెవరినీ గీత గుర్తించలేకపోయింది.
గీత తమ బిడ్డే అంటూ మీడియా ముందుకొచ్చిన బొల్లి స్వామి తమ కూతురు కోసం చాలా కాలంగా వెతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో తమకు ఓ పాప జన్మించిందని... ఆమెకు చిన్నప్పటి నుంచి మాటలు రావని బొల్లి స్వామి తెలిపారు. గీత తమ కూతురేనని అందుకు డీఎన్ఏ పరీక్షకూ తాను సిద్ధమేనని అన్నారు. పాప కనబడకుండా పోయినప్పటి నుంచి రోజూ తనకోసం గాలిస్తున్నామని వాపోయారు.
తన తల్లిదండ్రుల కోసం ఇంకా గాలిస్తున్నట్లు గీతా పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన గీత తమ కూతురేనంటూ చాలా కుటుంబాలు ముందుకు వచ్చాయి. తాజాగా బొల్లి స్వామి కుటుంబాన్ని ఆమె గుర్తించలేకపోయింది.