ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో 10 లక్షల మార్కును దాటేసిన కరోనా కేసులు

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు మిలియన్ మార్క్‌ దాటేశాయి. మలివిడతలో వేగంగా వ్యాప్తి చెందడంతో ఇప్పటిదాకా 10 లక్షల మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. పాజిటివిటీ రేట్‌ సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

రాష్ట్రంలో 10 లక్షల మార్కును దాటేసిన కరోనా కేసులు
రాష్ట్రంలో 10 లక్షల మార్కును దాటేసిన కరోనా కేసులు

By

Published : Apr 24, 2021, 6:52 AM IST

రాష్ట్రంలో 10 లక్షల మార్కును దాటేసిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 10లక్షల9 వేల 228 మంది కొవిడ్‌ బారినపడ్డారు. ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో శుక్రవారం ఒక్కరోజు వెలుగుచూసిన 11 వేల766 పాజిటివ్‌ కేసులే అత్యధిక రికార్డు. ప్రస్తుతం రాష్ట్రంలో 74 వేల 231 క్రీయాశీలక కేసులుండగా మలిదశలో వైరస్ తీవ్రస్థాయిలో విస్తరిస్తోంది. పాజిటివిటీ రేటు 25 శాతంగా నమోదవుతోంది. గతేడాది ఆగస్టు 14, 22 తేదీల్లో గరిష్టంగా 24 గంటల వ్యవధిలో 97 మంది చొప్పున మృతి చెందగా ప్రస్తుతం 38 మరణాలు నమోదవుతున్నాయి. గతేడాదితో పోల్చితే మరణాల శాతం తక్కువగా ఉన్నా పాజిటివిటీ రేటు తీవ్రస్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది నవంబరు 1న అత్యధికంగా ఒక్క రోజులోనే 88 వేల780 పరీక్షలు చేయగా ప్రస్తుతం 45 వేలు శాంపిల్స్‌ మాత్రమే సేకరిస్తున్నారు.

ఆంక్షల మయం...

కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై యంత్రాంగం దృష్టి సారించింది. పరీక్షలతోపాటు కొవిడ్‌ చికిత్స అందించే ఆస్పత్రుల సంఖ్య రెట్టింపు చేస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. తాడిపత్రిలో సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరవాలని పురపాలక అధికారులు ఆంక్షలు విధించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతీయ వైద్యశాలలో ఆక్సిజన్ పడకల సామర్థ్యాన్ని త్వరలోనే వందకు పెంచుతామని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. తిరుమల వచ్చే భక్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు ట్యాక్సీ, టెంపో వాహన డ్రైవర్లకు సూచించారు. కరోనా రోగులకు మరిన్ని పడకలు అందుబాటులోకి తెచ్చేందుకు ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో సౌకర్యాలు పరిశీలించిన కలెక్టర్‌.. గురుకుల, కస్తూర్భా పాఠశాలలనూ పరిశీలించాలని ఆధికారులను ఆదేశించారు.అద్దంకిలో మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలకు అనుమతిస్తూ ఆంక్షలు విధించారు. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలోని కొవిడ్ సెంటర్‌ను మంత్రి అనిల్‌ తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

జాగ్రత్తలపై ప్రచారం..

కాకినాడ జీజీహెచ్​లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ ఆసుపత్రుల బెడ్లు తక్షణమే మ్యాపింగ్ జరగాలని కలెక్టర్ నివాస్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ పీడ వీలైనంత త్వరగా తొలిగిపోవాలంటూ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో సభాపతి తమ్మినేని సీతారాం చండీయాగం నిర్వహించారు. విశాఖ ఆంధ్రవర్సిటీ పీజీ తొలి ఏడాది మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశాఖ జిల్లా చోడవరం ఎస్‌ఐ మహమ్మద్‌ మైక్‌లో ప్రచారం చేశారు. కరోనా వైద్యానికి ప్రైవేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేసినా ఆరోగ్యశ్రీ, ఉద్యోగ కార్డులపై చికిత్సకు నిరాకరించినా కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయాల్సిందిగా ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ మల్లికార్జున తెలిపారు. ఫిర్యాదులను 24గంటల్లో పరిష్కరిస్తామన్నారు.

ఇవీచదవండి.

వ్యాక్సినేషన్​పై వైకాపా సమన్వయకర్త సత్యనారాయణ అసంతృప్తి

మమతా మోహన్‌దాస్‌ 'లాల్‌బాగ్‌' ఫస్ట్‌లుక్

ఐపీఎల్​: ముంబయిపై పంజాబ్​ సమష్టి విజయం

ABOUT THE AUTHOR

...view details