ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 1, 2021, 2:58 PM IST

ETV Bharat / city

వంతెన కూలి ఒకరు మృతి, మరొకరికి గాయాలు

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పాత వంతెనను కొద్దిగా కూల్చి వదిలేశారు. అదే వంతెనపై ఎక్కి కేబుల్​ను తొలగించే క్రమంలో మిగిలిన వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ విషాదం జరిగింది.

bridge collapsed one person dead
వంతెన కూలి ఒకరు మృతి

తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చిక్లి వాగుపై ఉన్న పాత వంతెనను కొద్దిగా కూల్చి వదిలేశారు. సగం కూల్చిన వంతెనపై బీఎస్​ఎన్​ఎల్ కేబుల్​ను తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు మిగిలిన వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు శిథిలాల్లో చిక్కుకుని మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

బ్రిడ్జి పడుతున్న సమయంలో అటుగా వెళ్తున్న వాంకిడికి చెందిన కానిస్టేబుల్ శేషారావు చూశారు. వెంటనే స్పందించి ఒక క్షతగాత్రుణ్ని బయటకు లాగి.. కాపాడారు. మరొకరు పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోవడం వల్ల కాపాడలేకపోయారు. మృతుడు మహారాష్ట్ర చంద్రాపూర్ వాసి సూరజ్​గా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details