ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Singareni Accident: సింగరేణి గనిలో ప్రమాదం.. ఒకరు మృతి - amaravati latest news

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మూడో పరిధిలో ప్రమాదం జరిగింది. ఓపెన్‌కాస్ట్‌ ఒకటో గనిలో తెల్లవారుజామున డంపర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో డంపర్‌ ఆపరేటర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Singareni Accident
Singareni Accident

By

Published : Dec 23, 2021, 2:51 PM IST

మృతుడు శ్రీనివాస్‌రావు

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మూడో పరిధిలో ప్రమాదం జరిగింది. ఓపెన్‌కాస్ట్‌ ఒకటో గనిలో తెల్లవారుజామున డంపర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో డంపర్‌ ఆపరేటర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

డంపర్‌ ఆపరేటర్‌ శ్రీనివాస్‌రావు మృతదేహాన్ని గోదావరిఖని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. యాజమాన్యం కార్మికులకు రక్షణ కల్పించటంలో విఫలమవుతోందని నాయకులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details