ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గణేష్​ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ' - సీఎం జగన్ వార్తలు

వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.

jagan tweet
సీఎం జగన్

By

Published : Aug 22, 2020, 10:26 AM IST

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని...రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్య, విజ్ఞానం, వినయ ప్రదాత వినాయకుడని....విఘ్నాలను తొలగించి సకల అభిష్టాలను సిద్ధింపజేసే ఆదిపూజ్యుడు విఘ్నేశ్వరుడని ఆయన అన్నారు. ఆ గణేషుని ఆశీస్సులతో రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని.. కరోనాకష్టం తొలగిపోయి అంతటా సుఖసంతోషాలు నిండాలని ప్రార్ధిస్తున్నానన్నారు.

ABOUT THE AUTHOR

...view details