ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంతరిక్ష కేంద్రం నుంచి హైదరాబాద్‌లో మువ్వన్నెల జెండా చూశారా - On Independence Day Indian American Astronaut Raja Chari Shares Photo Of Indian Flag At Space Station

Raja Chari Shares Photo Of Indian Flag At Space Station భారతదేశ వ్యాప్తంగా వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అయితే అమెరికాలోని ప్రముఖ టెస్ట్‌ పైలట్‌, వ్యోమగామి రాజాచారి.. ఓ త్రివర్ణపతాక ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు.

1
1

By

Published : Aug 15, 2022, 5:14 PM IST

American Astronaut Raja Chari Shares Photo Of Indian Flag ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. భారత నౌకాదళం ఆరు ఖండాలకు నౌకలను పంపి వేడుకలను నిర్వహించగా.. వివిధ దేశాల్లో ఉన్న భారత సంతతి వ్యక్తులు ఉత్సాహంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా అమెరికాలోని ప్రముఖ టెస్ట్‌ పైలట్‌, వ్యోమగామి రాజాచారి ఆసక్తికర ఫొటోలు ట్వీట్‌ చేశారు.

Raja Chari Shares Photo Of Indian Flag At Space Station ''భారత స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రవాస భారతీయుడిగా నా తండ్రి నగరమైన హైదరాబాద్‌ ఎలా వెలిగిపోతోందో అంతరిక్షం నుంచి వీక్షిస్తున్నా. భారత అమెరికన్లు నిత్యం పురోగమిస్తోన్న వాటిల్లో నాసా కూడా ఒకటి'' అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని ఆవిష్కరించిన ఫొటోలను షేర్‌ చేశారు.

మరోవైపు స్పేస్‌ కిడ్స్‌ ఇండియా సంస్థ ఓ బెలూన్‌ సాయంతో భారత పతాకాన్ని 30 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చింది. అక్కడ పతాకాన్ని ఆవిష్కరించింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details