ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telangana Omicron Cases: తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

Telangana Omicron Cases: తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 55కు చేరింది.

Telangana Omicron Cases:
Telangana Omicron Cases:

By

Published : Dec 27, 2021, 9:35 PM IST

Telangana Omicron Cases: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 55కు చేరుకుంది. ఇప్పటివరకు ఒమిక్రాన్​ బారిన పడిన 10 మంది బాధితులు కోలుకున్నారు.

ఇవాళ వెలుగుచూసిన కేసుల్లో 10 మంది నాన్​రిస్క్​ దేశాల నుంచి వచ్చిన వారేనని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు కాంటాక్ట్ ఒమిక్రాన్ బాధితులని తెలిపారు.

ఏపీలో 54 కరోనా కేసులు..
AP Corona Cases: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 17,940మందికి కరోనా పరీక్షలు చేయగా.. 54 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా నుంచి మరో 121 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,099 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో స్థిరంగా కరోనా కేసులు..
India covid cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 6,531 కేసులు వెలుగుచూశాయి. మరో 315 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,141 మంది కోలుకున్నారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కు పెరిగింది.

  • మొత్తం కేసులు: ‬3,47,93,333‬
  • మొత్తం మరణాలు: 4,79,997
  • యాక్టివ్ కేసులు: 75,841
  • కోలుకున్నవారు: 3,42,37,495‬

Vaccination in India
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 29,93,283 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,41,70,25,654కు చేరింది.

Covid world cases
అటు, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 3,81,872 కేసులు వెలుగులోకి వచ్చాయి. 3,022 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • అమెరికాలో కొత్తగా 96,384 కేసులు నమోదయ్యాయి. 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,37,854కు పెరిగింది.
  • ఫ్రాన్స్​లో 27 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 96 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 122,642కు చేరింది.
  • ఇటలీలోనూ కరోనా తీవ్రంగానే ఉంది. కొత్తగా 24 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. 81 మంది మృతి చెందారు.
  • రష్యాలో కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదవుతోంది. కరోనా తీవ్రతకు మరో 968 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 23 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం మరణాల సంఖ్య 304,218కు చేరుకుంది.

ఇవీ చదవండి:

CM Jagan Review On Omicron Variant: ఎలాంటి పరిస్థితులైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details