ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

omicron cases in telangana: తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు - తెలంగాణ కొవిడ్​ వార్తలు

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 24కి చేరింది.

తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు
తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు

By

Published : Dec 21, 2021, 9:08 PM IST

omicron cases in telangana :తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 24కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 726 మంది శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు.

covid cases in telangana : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,919 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 172 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,79,892కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,016కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 188 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,625 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి:YS Viveka Murder Case: వివేకా హత్యకేసు నిందితుల బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌

ABOUT THE AUTHOR

...view details