ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: అనారోగ్యంతో ఉన్నా విధులకు రమ్మంటున్నారని నర్సుల ఆందోళన - హైదరాబాద్​

హైదరాబాద్​ మహా నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం తమను వేధిస్తోందని నర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు కరోనా వైరస్ సోకినప్పటికీ... కొవిడ్ విధులు కేటాయించారని వాపోయారు.

telangana nurses
తెలంగాణ: అనారోగ్యంతో ఉన్నా విధులకు రమ్మంటున్నారని నర్సుల ఆందోళన

By

Published : Jul 19, 2020, 10:30 PM IST

తెలంగాణ: అనారోగ్యంతో ఉన్నా విధులకు రమ్మంటున్నారని నర్సుల ఆందోళన

హైదరాబాద్‌ మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు నుంచి వచ్చి హైదరాబాద్​లోని ఆలివ్‌ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న తమను యాజమాన్యం వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను నిర్భందించి కొవిడ్ డ్యూటీలు చేయిస్తున్నారని బాధిత నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు.

మీరే ఆదుకోవాలి...

తమను ఆదుకోవాలని తెలంగాణ నర్సింగ్ సమితికి బాధితులు లేఖ రాశారు. ఇప్పటికే ఎంతోమంది నర్సులకు కరోనా వైరస్ సోకిందని.. వ్యాధి లక్షణాలున్నప్పటికీ విధులకు రావాలంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం మీద తమకు నమ్మకముందని... తమను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : మహిళ మృతి.. భయంతో యువకుడి బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details