ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

3 చోట్ల ఒలెక్ట్రా, 2 చోట్ల లేలాండ్‌.. ఆర్టీసీ ఊహించిన ధర కంటే అధికంగా కోట్‌ - rtc buses news

ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడిపే విద్యుత్తు బస్సుల టెండర్లలో 3 నగరాల్లో ఒలెక్ట్రా, 2 నగరాల్లో అశోక్‌ లేలాండ్‌ సంస్థలు ఎల్‌-1గా నిలిచాయి. ప్రతి కి.మీ.కు ఆర్టీసీ ఊహించిన ధర కంటే ఎక్కువ మొత్తంలో ఈ సంస్థలు కోట్‌ చేశాయి. టెండర్ల ఖరారుపై ఆర్టీసీ అధికారులు శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నారు.

rtc electric buses
ఆర్టీసీ విద్యుత్తు బస్సులు

By

Published : Jun 24, 2021, 10:19 AM IST

ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడిపే విద్యుత్తు బస్సుల టెండర్లలో 3 నగరాల్లో ఒలెక్ట్రా, 2 నగరాల్లో అశోక్‌ లేలాండ్‌ సంస్థలు ఎల్‌-1గా నిలిచాయి. తిరుపతి, విశాఖలో 100 చొప్పున, విజయవాడ, గుంటూరు, కాకినాడల్లో 50 చొప్పున మొత్తం 350 బస్సులకు.. 5 లాట్లుగా టెండర్లు పిలిచారు. వీటిలో ఒలెక్ట్రా, అశోక్‌ లేలాండ్‌లు సాంకేతిక అర్హత సాధించాయి. వీటి రివర్స్‌ టెండర్ల ప్రక్రియను బుధవారం నిర్వహించారు. ఇందులో తిరుపతి, విశాఖపట్నం, గుంటూరులలో (250 బస్సులు) ఒలెక్ట్రా, విజయవాడ, కాకినాడలలో (100 బస్సులు) అశోక్‌ లేలాండ్‌ సంస్థలు ఎల్‌-1గా నిలిచాయి. ఇవి ప్రతి కి.మీ.కు ఆర్టీసీ ఊహించిన ధర కంటే ఎక్కువ మొత్తం కోట్‌ చేశాయి. రివర్స్‌ టెండర్లలో నామమాత్రంగా కొంత ధరను తగ్గించాయని సమాచారం. ఈ 2 సంస్థల ప్రతినిధులతో ఆర్టీసీ అధికారులు శుక్రవారం చర్చించనున్నారు. తర్వాత టెండర్ల ఖరారుపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details