Flood Drone Visuals: భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతం అతలాకుతలమమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చిన వరదపోటు భద్రాద్రిలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 62.20 అడుగుల వద్ద కొనసాగుతుంది. నదీపరివాహక ప్రదేశాల్లో భారీ ఎత్తున వరద చేరి భయానక వాతావరణం చోటు చేసుకుంది. ఫలితంగా గోదావరి తీరప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముంపు బాధితులు ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటుండగా.. ఇళ్ల వద్దే ఉన్న బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. జులై మొదటిపక్షంలోనే ఈ స్థాయిలో వరదపోటెత్తడం గోదావరి చరిత్రలోనే ఇది రెండోసారి. 1976లో తొలిసారి భద్రాచలం వద్ద 63.9 అడుగుల నీటిమట్టం జూన్ 22న నమోదైంది. ఆ తర్వాత జులై రెండో వారంలో 60 అడుగులు దాటడం ఇదే ప్రథమం. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే బస చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. గోదావరి తీవ్రతను తెలుసుకునేందుకు అధికారులు డ్రోన్ సాయం తీసుకున్నారు. అంతకంతకూ పెరుగుతున్న వరదనీటితో విశ్వరూపం చూపిస్తున్న గోదావరి ఉగ్రరూపాన్ని మీరు చూసేయండి.
1
By
Published : Jul 14, 2022, 7:39 PM IST
భద్రాచలాన్ని చుట్టుముట్టిన వరదనీరు.. డ్రోన్ దృశ్యాల్లో గోదావరి ఉగ్రరూపం