ఆర్టీసీ బస్సుల్లో మళ్లీ కండక్టర్లను అందుబాటులోకి తేవాలని అధికారులు ఆలోచిస్తున్నారు. కరోనా కారణంగా బస్సులను మే 21 నుంచి డ్రైవర్లతోనే నడిపిస్తున్నారు. అతి తక్కువ చోట్ల స్టాప్‌లు ఉండటంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కండక్టర్లతో బస్సులు నడిపే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
కొద్ది నెలలుగా ఆర్టీసీకి సలహాదారులుగా పని చేస్తున్న ఇద్దరు రాజీనామా చేశారు. జనవరిలో ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వీరిని నియమించగా, ఒకరు విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో, మరొకరు హైదరాబాద్‌లో ఉంటూ బాధ్యతలను నిర్వహించారు. మాదిరెడ్డి ప్రతాప్ బదిలీ కావడంతో ఆ ఇద్దరు రాజీనామా చేశారు. ఎండీ పేషీలో పని చేసిన ఇద్దరు పొరుగు సేవల మహిళా సిబ్బందీ రాజీనామా చేశారు.