ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మా భూభాగంలో ఏపీ పంచాయతీ ఎన్నికలా..? - Odisha government contempt of court case in Supreme Court latest news

తమ భూభాగంలోకి వచ్చే మూడు పంచాయతీల పేర్లు మార్చి.. అక్కడ ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఒడిశా ప్రభుత్వం బుధవారం రాత్రి సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని అందులో ఆరోపించింది.

Odisha government
Odisha government

By

Published : Feb 11, 2021, 11:18 AM IST

Updated : Feb 11, 2021, 12:04 PM IST

సుప్రీంకోర్టులో ఒడిశా ప్రభుత్వం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. తమ భూభాగంలోని 3 పంచాయతీల పేర్లు మార్చి ఎన్నికలు నిర్వహిస్తున్నారని పిటిషన్​లో పేర్కొంది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని ఆరోపించింది. సీఎస్‌, ఎస్‌ఈసీ నుంచి సంజాయిషీ కోరి కారకులపై చర్యలు తీసుకోవాలని వ్యాజ్యంలో పేర్కొంది. గంజాయ్‌పదర్‌ పేరును గంజాయ్‌భద్రగా , ఫట్టు సెనరీ పేరును పట్టుచెన్నూరుగా, ఫగు సెనరీ పేరు పగులుచెన్నూరుగా మార్చారని పిటిషన్ లో తెలిపింది. 3 పంచాయతీల్లో గతంలో తాము ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్న ఒడిశా.. అందుకు సాక్ష్యాలు ఉన్నాయని వివరించింది. 3 పంచాయతీల్లో ఏకగ్రీవం చేసినట్లు.. పగులూరు చెరువుగా పిలిచే ఫగుసెనరీలో మాత్రం ఎన్నికల నిర్వహించినట్లు వ్యాజ్యంలో పేర్కొంది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని.. ఉన్నతాధికారుల నుంచి సంజాయిషీ కోరాలని ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

Last Updated : Feb 11, 2021, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details