త్రిబుల్ ఐటీ క్యాంపస్లో మంత్రి
యోగాతో మనసు ఉల్లాసం: మంత్రి ఆదిమూలపు సురేష్ - minister suresh on yoga
యోగ సాధనతో మనసు, శరీరం మన అధీనంలోనే ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీలో జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల పరిధిలో యోగా పోటీల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. త్రిబుల్ ఐటీ క్యాంపస్ విద్యార్థులు యోగ సాధనలో మేటిగా నిలవడం ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందన్నారు. ఈ పోటీల్లో మహిళా విభాగంలో నూజివీడు త్రిబుల్ ఐటీ ప్రథమ స్థానం దక్కించుకోగా జెంట్స్ విభాగంలో తమిళనాడు అన్నా యూనివర్సిటీ ప్రథమ స్థానం దక్కించుకుంది.

త్రిబుల్ ఐటీ క్యాంపస్లో మంత్రి