ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ మూడు రాజధానులపై కేటీఆర్​ ఏమన్నారంటే..! - 2019 MEMORIES OF KTR

ట్విట్టర్​ వేదికగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తెలంగాణ మంత్రి కేటీఆర్​ సమాధానాలిచ్చారు. ఆస్క్​ కేటీఆర్​ హాష్​ట్యాగ్​తో సాగిన ప్రశ్నలు సమాధానాల ప్రక్రియలో... ఎన్నో విషయాలకు మంత్రి స్పందించారు. పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్​ తనదైన శైలిలో సమాధానాలిస్తూ... యువతను ఆకట్టుకున్నారు.

మూడు రాజధానులపై కేటీఆర్​ ఏమన్నారంటే..!
మూడు రాజధానులపై కేటీఆర్​ ఏమన్నారంటే..!

By

Published : Dec 29, 2019, 6:35 PM IST

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్​... నెటిజన్లతో ట్విట్టర్​ వేదికగా ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ముఖ్యమైన, ఆసక్తికరమైన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ... సమాధానాలిచ్చారు. ఇందులో ప్రధానంగా మన రాష్ట్ర రాజధానుల అంశంపై అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

ప్రశ్న: ఏపీలో 3 రాజధానులపై మీ అభిప్రాయమేంటి...? తెలంగాణ వాసిగా కాదు... ఒక భారతీయునిగా సమాధానం చెప్పండి...?
సమాధానం: 3 రాజధానుల అంశాన్ని ఏపీ ప్రజలు నిర్ణయించాలి.. నేను కాదు.

మూడు రాజధానులపై కేటీఆర్​ ఏమన్నారంటే..!

ప్రశ్న:ఆంధ్రప్రదేశ్​లో మీ పార్టీని విస్తరించండి. అక్కడ రెండు పార్టీలు వ్యక్తిగత కక్ష్యలు పెట్టుకున్నాయి. మీరు వస్తే బాగుంటుంది.

సమాధానం: కృతజ్ఞతలు మిత్రమా... ఉద్యమ సమయంలో తెలంగాణకు సరైన నాయకత్వమే లేదన్నారు. ఇప్పుడు తెరాసను పొరుగు రాష్ట్రాలకు విస్తరించమని అంటున్నారు. ఏపీ ప్రజల నుంచి ఇలాంటి స్వాగతం లభించటమనేది సీఎం కేసీఆర్​ గొప్ప నాయకత్వానికి నిదర్శనం.

ABOUT THE AUTHOR

...view details