దేశవ్యాప్తంగా ఈ నెల 24న జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్‌టీఎస్‌ఈ)-2 జరగనుంది. గత జూన్ 13వ తేదీన ఈ పరీక్షను నిర్వహించాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. రాష్ట్రాలు జరిపిన ఎన్‌టీఎస్‌ఈ-1 పరీక్షలో ఉత్తీర్ణులైన వారు జాతీయ స్థాయిలో జరిగే పరీక్షకు హాజరవుతారు. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ తర్వాత సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) తెలిపింది. ఫిబ్రవరిలో జరిగిన ఎన్‌టీఎస్‌ఈ-1 పరీక్షలో తెలంగాణ నుంచి 225 మంది ఉత్తీర్ణులయ్యారు. వారు ఎన్‌టీఎస్‌ఈ-2 పరీక్షకు హాజరవుతారు. ఇందులో ఉత్తీర్ణులైన 2 వేల మందికి ఉపకారవేతనాలు అందుతాయి.
NTSE EXAM: 24న జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష - NTSE exam
కరోనా కారణంగా వాయిదా పడిన జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్‌టీఎస్‌ఈ)-2 జరగనుంది. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ తర్వాత సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) తెలిపింది.
24న జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష