ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హెరిటేజ్ నిధులతో సేవలు విస్తృతం: ఎన్టీఆర్ ట్రస్టు - హెరిటేజ్ నిధులతో పేదలకు సాయం

హెరిటేజ్ సంస్థ సీఎస్​ఆర్ నిధులు, దాతల సహకారంతో సేవలను మరింత విస్తృతం చేశామని ఎన్టీఆర్ ట్రస్టు తెలిపింది. కొవిడ్ బాధితుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

హెరిటేజ్ నిధులతో సేవలు విస్తృతం: ఎన్టీఆర్ ట్రస్టు
హెరిటేజ్ నిధులతో సేవలు విస్తృతం: ఎన్టీఆర్ ట్రస్టు

By

Published : May 25, 2021, 8:22 AM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమవంతు కార్యక్రమాలను చేపడుతూ పేదలకు అండగా నిలుస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్టు ప్రకటించింది. హెరిటేజ్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులు, దాతల సహకారంతో ట్రస్ట్‌ తమ కార్యకలాపాలను విస్తృతం చేస్తోందని వెల్లడించింది. దాతలతో మాట్లాడి రోగులకు అవసరమైన సాయం తక్షణమే అందించేలా చర్యలు చేపడుతున్నట్లు ట్రస్టు తెలిపింది.

ఆన్‌లైన్‌ సేవలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని.. వాట్సాప్‌ చాట్‌ ద్వారా ప్రఖ్యాత డాక్టర్లచే వైద్యసలహాలను అందించే కార్యక్రమం కొనసాగుతోందని వెల్లడించింది. కరోనా రోగుల బంధువుల కోసం అన్నదానం చేస్తున్నామని.. సాయం కోసం తమను సంప్రదించేందుకు ప్రత్యేకంగా కాల్‌సెంటర్​ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details