ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో సన్‌బర్న్‌ ఈవెంట్‌ అడ్డగింతకు ఎన్‌ఎస్‌యూఐ యత్నం.. అడ్డుకున్న పోలీసులు.

NSUI Activists Protest against Sunburn Event: తెలంగాణలో సన్‌బర్న్‌ ఈవెంట్‌ నిర్వహణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు వారిని స్టేషన్​కు తరలించారు.

Sunburn Event
సన్‌బర్న్‌ ఈవెంట్‌

By

Published : Sep 24, 2022, 2:04 PM IST

NSUI Activists Protest against Sunburn Event: శంషాబాద్‌లో సన్‌బర్న్‌ ఈవెంట్‌ నిర్వహణను అడ్డుకునేందుకు ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు యత్నించారు. దీంతో పోలీసులు ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న ప్రదేశంలో జరిగిన సన్‌బర్న్ షోకు పోలీసులు అనుమతినివ్వడంపై ఎన్​ఎస్​యూఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గురువారం కార్యకర్తలతో డీసీపీ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు.

దీంతో షో వద్ద గందరగోళం నెలకొంటుందని శుక్రవారం శంషాబాద్‌ విమానాశ్రయం ఎరినా ప్రాంగణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ అక్కడికి చేరుకున్న ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సన్​బర్న్‌ కార్యక్రమంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు.. ఆందోళనకారులను అడ్డుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఇలాంటి పాశ్చాత్య సంస్కృతితో తెలంగాణ నాశనం అవుతోందన్న ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు.. సేవ్ తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

సన్‌బర్న్‌ ఈవెంట్‌ నిర్వహణను అడ్డుకునేందుకు యత్నించిన ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details