రాజధాని అమరావతి కోసం ప్రవాసాంధ్రులు ఖండాంతరాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. ''సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్'' పేరుతో అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలు నిరసనలు చేపట్టారు. అమెరికాలోని వివిధ నగరాల్లో సమావేశాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే కానీ పాలన వికేంద్రీకరణ కాదని ప్రవాసాంధ్రులు అభిప్రాయపడ్డారు. కాలిఫోర్నియా, హ్యూస్టన్, ఒమాహ, కాన్సాస్ సిటీ, పోర్ట్‌ల్యాండ్‌లో ప్రదర్శనలు చేస్తున్నారు. అట్లాంటా, సెయింట్ లూయిస్, డెట్రాయిట్, బోస్టన్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అమరావతి కోసం ఖండాంతరాల్లోనూ నిరసనలు - అమరావతికి ప్రవాసాంధ్రుల మద్దతు
అమరావతి కోసం ప్రవాసాంధ్రులూ పోరాడుతున్నారు. రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ అమెరికాలో నిరసనలు, ధర్నాలు చేపట్టారు. మూడు రాజధానులు వద్దంటూ నినాదాలు చేశారు.
అమరావతి రాజధానికి ప్రవాసాంధ్రుల మద్దతు