అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ లండన్‌లో పలువురు ప్రవాసాంధ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఐరోపా ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో లండన్ పార్లమెంటు స్క్వేర్ వద్ద ఆందోళన తెలిపారు. అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ... '3 రాజధానులు వద్దు - అమరావతే ముద్దు' అంటూ గాంధీ విగ్రహం ఎదుట నినాదాలు చేశారు. ‘'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని'' అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు.
అమరావతి మద్దతుగా.. లండన్‌లో ప్రవాసాంధ్రుల నిరసన - అమరావతికి మద్దతుగా లండన్‌లో ర్యాలీ
'ఒకే రాష్టం - ఒకే రాజధాని' అంటూ అమరావతికి మద్దతుగా లండన్‌లో ప్రవాసాంధ్రులు నిరసన చేశారు. లండన్ పార్లమెంట్ స్క్వేర్ వద్ద '3 రాజధానులు వద్దు - అమరావతే ముద్దు' అంటూ నినాదాలు చేశారు.
అమరావతి మద్దతుగా.. లండన్‌లో ప్రవాసాంధ్రుల నిరసన