అమరావతి కోసం ప్రవాసాంధ్రుల విరాళం 15 లక్షలు - అమరావతి కోసం ప్రవాసాంధ్రుల విరాళం 15 లక్షలు
రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాన్ని అందరూ ప్రశంసిస్తే.. వైకాపా ప్రభుత్వం మాత్రం అక్రమ కేసులతో వేధిస్తోందని చంద్రబాబు మండిప్డడారు. అమరావతి రైతులు, ప్రవాసాంధ్రులు చంద్రబాబును కలిశారు. అమరావతి పోరాటానికి ప్రవాసాంధ్రులు 15లక్షల 71 వేల రూపాయల విరాళం అందించారు. పుణ్య భూమి రుణం తీర్చుకునేందుకు ప్రవాసాంధ్రులు ఇస్తున్న తోడ్పాటు అభినందనీయమని చంద్రబాబు ప్రశంసించారు.
రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాన్ని ప్రపంచం మొత్తం ప్రశంసిస్తే.. వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతుల పట్ల 2500కు పైగా అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డారు. అమరావతి కలల్ని ప్రభుత్వం చంపేసిందన్న ఆయన.. న్యాయం జరిగే వరకు ఈ ధర్మ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. రైతులకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. రాజధాని రైతులు, ప్రవాసాంధ్రులు ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబును కలిసి.. అమరావతి పోరాటానికి 15.71లక్షల రూపాయల విరాళాన్ని అందచేశారు. పుణ్య భూమి రుణం తీర్చుకునేందుకు ప్రవాసాంధ్రులు ఇస్తున్న తోడ్పాటు అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. 92రోజుల నుంచి రాజధాని రైతులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందన్న ఆయన.. ఎన్ని రోజులైనా పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.