ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని రైతులకు ఎన్నారై వైద్యుల అండ.. ఉచిత వైద్యసేవలు - ఉచిత వైద్యసేవలు

రాజధాని కోసం రెండు సంవత్సరాలకుపైగా అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతులకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు ఎన్నారై వైద్యులు ముందుకొచ్చారు. జూమ్​ ద్యారా ఈ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

nri doctors providing free medication to amaravati farmers
రాజధాని రైతులకు ఎన్నారై వైద్యుల అండ

By

Published : Jul 13, 2021, 3:03 PM IST

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళన చేస్తూ ఆనారోగ్యానికి గురైన రైతులకు, మహిళలకు ఎన్నారై వైద్యులు అండగా నిలిచారు. శిబిరాల్లో నిరసన దీక్షలో పాల్గొనడం వల్ల కొంతమంది రైతులకు ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలొచ్చాయి. వీరికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్నారై వైద్యులు ప్రకటించారు.

అమెరికాకు చెందిన అట్లూరి అశ్విన్ ఆధ్వర్యంలో వైద్యులు జూమ్ ద్వారా రైతుల అనారోగ్య సమస్యలను తెలుసుకొని.. తగిన పరిష్కార మార్గాలను సూచించనున్నారు. వెలగపూడి, పెదపరిమి దీక్షా శిబిరాల్లో.. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం.. ఆ రెండు శిబిరాల్లో అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల నుంచి రక్త నమూనాలను తీసుకొని వాటిని 48 రకాలుగా పరీక్షించిన తర్వాత మందులు ఇవ్వనున్నట్లు అశ్విన్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details