రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ(Notifications for Medical Staff Recruitment-2021)కి అక్టోబరు1న ప్రకటనల విడుదలకు కసరత్తు కొనసాగుతోంది. నోటిఫికేషన్ ఇచ్చాక రెండు వారాల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. పోస్టుల స్థాయినిబట్టి నవంబరు/డిసెంబరు నాటికి పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆమోదించిన మేరకు.. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని పంపిన ప్రతిపాదనల అమలుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులనివ్వాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ(AP Medical Staff Recruitment-2021)లోని అన్ని రకాల ప్రభుత్వాసుపత్రుల్లో మంజూరై ఖాళీగా ఉన్నవి, అవసరాలకు తగ్గట్టు అదనంగా భర్తీ చేయాలని గుర్తించిన పోస్టులు కలిపి 14,391 వరకున్నాయి. వైద్యుల నియామకాలకు రాష్ట్ర స్థాయిలో, స్టాఫ్‌నర్సులు, పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే కమిటీ ద్వారా నోటిఫికేషన్లు వెలువడతాయి.
AP Medical Staff Recruitment: వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి అక్టోబరు1న ఉద్యోగ ప్రకటన! - వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ -2021
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ(Notifications for Medical Staff Recruitment-2021)కి అక్టోబరు1న ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కసరత్తు చేస్తోంది.
బోధనాసుపత్రుల్లో సహాయ ఆచార్యుల పోస్టులను నేరుగా, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులను పదోన్నతులపై భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు రాఘవేంద్రరావు తెలిపారు. బోధనాసుపత్రుల్లో క్షేత్ర స్థాయి సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు ప్రత్యక్ష విధానంలో భర్తీ చేస్తారు. పారామెడికల్ పోస్టులను పొరుగు సేవల కింద భర్తీ చేస్తారు. బోధనాసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్ల సహాయకులు, స్పీచ్‌థెరపిస్ట్, ఈసీజీ టెక్నిషియన్, రేడియోగ్రాఫర్ వంటి పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ(AP Medical Staff Recruitment-2021)లో ప్రస్తుతం సుమారు 3500 మంది ఏఎన్‌ఎంలు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో స్టాఫ్‌నర్సులకు తగ్గ అర్హతలు 600 మందికి (జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్) ఉన్నట్లు గుర్తించారు. మిగిలినవారికి ఆ అర్హతలు లేనందున శిక్షణనిస్తారు.