ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

1,184 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - notification for doctors recruitment

వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ జనరల్, జిల్లా ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యులను నియమించనున్నారు.

notification for doctors recruitment in ap
వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

By

Published : Apr 17, 2020, 4:12 PM IST

ప్రభుత్వ జనరల్, జిల్లా ఆస్పత్రుల్లో 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు స్పెషలిస్టు డాక్టర్లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల నియామకానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 592 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, 192 మత్తు వైద్యులు, 400 జనరల్, పల్మనరీ మెడిసిన్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఏడాది ఒప్పంద పద్ధతిలో నియామకాలు చేపట్టనున్నారు. ఈనెల 19 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ABOUT THE AUTHOR

...view details