రాజధాని తరలింపునకు దురుద్దేశపూర్వకంగా చట్టాలు చేశారని అమరావతి ప్రాంత రైతుల తరఫున దాఖలైన పిటిషన్పై.. హై కోర్టులో విచారణ జరిగింది. రైతుల తరఫున న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. గతంలో.. అమరావతిని రాజధానిగా ప్రతిపాదించినప్పటి సందర్భాన్ని... న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైకాపా నేతలు అమరావతిని రాజధానిగా సమ్మతించడం.. తర్వాత ప్రభుత్వం మారినా రాజధాని మారబోదని తెదేపా ప్రభుత్వం చెప్పడం వంటి సంఘటనలను వివరించారు. భాజపాతో పాటు.. ఇతర పార్టీల నేతలు సైతం చెప్పిన విషయాలను కోర్టు ముందు ఉంచారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం... ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్, మంత్రులు బొత్స, బుగ్గన, గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబుతో పాటు భాజపాకు సైతం నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలుకు అవకాశం కల్పించింది.
రాజధాని రైతుల పిటిషన్పై విచారణ: సీఎం సహా.. రాజకీయ నేతలకు హైకోర్టు నోటీసులు - అమరావతి వార్తలు
notices to cm, ministers, opposition leader and bjp in capital farmers petition by high court
12:24 August 27
.
Last Updated : Aug 27, 2020, 3:51 PM IST