ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోని ఆగ్నేయ ద్వీపకల్పంలో ప్రారంభయయ్యే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. శనివారం నాటికి ఈశాన్య భారతదేశంలోని మిగిలిన భాగాలతోపాటు పశ్చిమ బంగా, ఒడిశాలోని మిగిలిన భాగాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి తిరోగమించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వివరించారు. వీటి ప్రభావంతో... కోస్తా, రాయలసీమల్లోని ఒకట్రెండు చోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని స్టెల్లా వెల్లడించారు.
NORTHEAST MONSOONS: దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు.. ఎప్పుడొస్తున్నాయంటే..? - ఏపీ లేటెస్ట్ న్యూస్
ఈనెల 26వ తేదీన ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి వచ్చే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లోని ఒకట్రెండు చోట్ల తేలికపాటి వానలు కురవొచ్చని పేర్కొన్నారు.
26న దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు..