తెలంగాణవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికకు 41 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉపఎన్నికలో మొత్తం 77 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. నామపత్రాల పరిశీలనలోనే 17 మంది పత్రాలను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 60 మందిలో 19 మంది అభ్యర్థులు తమ పత్రాలను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా సాగర్ ఉప ఎన్నిక బరిలో 41 మంది నిలిచారు.
తెరాస నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, భాజపా నుంచి రవినాయక్ బరిలో ఉన్నారు. మరోవైపు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఇంటింటికీ వెళ్లి ఆశీర్వదించాలని ఓటరు మహాశయులను కోరుతున్నారు.