స్థానిక సమరంలో మెుదటి అంకం ప్రారంభమైంది. తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మెుదలయ్యింది. నామినేషన్ల ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగనుండగా... ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు అధికారులు అందుబాటులో ఉంటారు.
మెుదటి అంకం... నామినేషన్ల స్వీకరణ ప్రారంభం - ఏపీ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు 2021 న్యూస్ట
స్థానిక ఎన్నికల పోరులో తొలి దశ అయిన.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 10.30 నిమిషాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తున్నారు.
నామినేషన్లు
ఈ నెల 31 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడవు కాగా... నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4 వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 9న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మెుదటి దశలో మెుత్తం 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో తొలి దశ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.