రాష్ట్రంలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు అభ్యర్థుల నామినేషన్లతో జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్లకు బుధవారం చివరి రోజు కావడంతో... అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలయ్యాయి.
ప్రకాశం జిల్లాలో వైకాపా జడ్పీ ఛైర్‌పర్స్‌న్ అభ్యర్థి అనుకుంటున్న బూచేపల్లి వెంకాయమ్మ దర్శి నుంచి పోటీ చేస్తున్నారు. వెంకాయమ్మ నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేశ్ హాజరయ్యారు.
గుంటూరు జడ్పీ ఛైర్‌పర్స్‌న్ వైకాపా అభ్యర్థి భావిస్తున్న కత్తెర క్రిష్టినా కొల్లిపొర జడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేశారు. వైకాపా ఎమ్మెల్యేలతో కలిసి ఆమె నామపత్రం దాఖలు చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు జడ్పీటీసీగా కాంగెస్ పార్టీ తరఫున మరుగుజ్జు మహిళ భాగ్యలక్ష్మి నామినేషన్ వేశారు.
పలుచోట్ల తెదేపా అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైకాపా నేతలు అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, చింతలపూడి ప్రాంతాల్లో తెదేపా అభ్యర్థులను బెదిరించారు. పోలీసులు కొందరు వైకాపా అభ్యర్థులకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా ఎన్.చామవరంలో ఓటు అమ్ముకోకు... ప్రజాస్వామ్యాన్ని కాటేయకు అంటూ బోర్డులు పెట్టి ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగియడంతో పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ జరిగే చోట బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండీ... పల్నాడులో కర్రలు, కత్తుల స్వైరవిహారం