ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం మొత్తం 14 మంది అభ్యర్థులు 30 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. తూర్పు-పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి నలుగురు అభ్యర్థులు 8 సెట్లు, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 10 మంది అభ్యర్థులు 22 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు వివరించారు. వీటి నామినేషన్ల స్వీకరణకు మంగళవారమే తుది గడువు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలుకు నేడు తుది గడువు - ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వార్తలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు నేటితో ముగియనుంది. సోమవారం మొత్తం 14 మంది అభ్యర్థులు 30 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు.
mlc eenadu