Deputy Chairman of AP Legislative Council: ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి అధికార వైకాపా ఎమ్మెల్సీ జకీయా ఖానం నామినేషన్ దాఖలు చేశారు. ఓకే నామినేషన్ రావడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయితే ఆమె ఎన్నికను మండలి ఛైర్మన్(AP Legislative Council news) నేడు అధికారికంగా ప్రకటించున్నారు. తొలిసారి మైనారిటీ మహిళకు డిప్యూటీ ఛైర్మన్ పదవి దక్కనుంది.
council deputy chairman: మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా జకీయా ఖానం.. నేడు ప్రకటించనున్న ఛైర్మన్ - AP Legislative Council Deputy Chairman Zakia Khanam
శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్(Deputy Chairman of AP Legislative Council) పదవికి అధికార వైకాపా ఎమ్మెల్సీ జకీయా ఖానం గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఓకే నామినేషన్ రావడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆమె ఎన్నికను మండలి ఛైర్మన్.. నేడు అధికారికంగా ప్రకటించున్నారు.
ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు
జకీయా ఖానంకు మండలి వైఎస్ ఛైర్మన్ పదవి ఇవ్వడం హర్షనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీలపై సీఎం జగన్‌కు ఉన్న ప్రేమ స్పష్టమైందని కొనియాడారు.
ఇదీ చదవండి.. :SECI NEWS: సెకి నుంచి యూనిట్ విద్యుత్ రూ.2.49కి కొనేందుకు సర్కారు నిర్ణయం.. ఏడాదికి రూ.850 కోట్ల భారం