గుంటూరు జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్‌ను కరోనా నియంత్రణ, పర్యవేక్షణ కోసం నోడల్ అధికారిగా నియమిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లాకు కాంతిలాల్ దండే, అనంతపురం జిల్లాకు విజయనంద్ నియమితులయ్యారు. జిల్లాల్లోని కరోనా నియంత్రణ, పర్యవేక్షణ కంటైన్మెంట్ బాధ్యతలు ఈ అధికారులు చూసుకోనున్నారు. నోడల్ అధికారులు తక్షణమే రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
కరోనా నియంత్రణ, పర్యవేక్షణకు నోడల్ అధికారులు
కరోనా నియంత్రణ, పర్యవేక్షణ కోసం నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ముగ్గురు అధికారులను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
nodel officers for corona