ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రాణాలను నిలిపే ప్రాణాధారాలను పక్కన పెట్టేశారు...! - ఏపీలో కరోనా కేసులు

అత్యవసర స్థితిలో.. ప్రాణాలు నిలిపి ఉంచగలిగే పరికరాలు వెంటిలేటర్లు. కరోనా విపత్తులో వాటి అవసరం మరింత పెరిగింది. కొన్ని చోట్ల సరిపడా వెంటిలేటర్లు లేక వైద్యులు, రోగులు ఇబ్బంది పడుతుంటే... కర్నూలు జిల్లాలో ప్రాణధార వ్యవస్థలున్నప్పటికీ నిరూపయోగంగానే ఉన్నాయి. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ వాటిని నియోగించుకోవటంపై అధికారులు దృష్టిపెట్టడం లేదు.

no use of ventilators
no use of ventilators

By

Published : Sep 6, 2020, 7:17 AM IST

కర్నూలు జిల్లాలో కరోనా మరణాలు ఆగట్లేదు. కొవిడ్‌ రోగులు ఆక్సిజన్‌ స్థాయి 80 శాతం కంటే తక్కువ ఉ‌న్నప్పుడు ప్రాణభయంతో పరుగులు తీస్తున్న రోగులు... వెంటిలేటర్లు ఖాళీగా లేవని చెప్పగానే మరింత ఆందోళనకు గురవుతున్నారు. కేంద్రం వెంటిలేటర్లు పంపించినా వాటిని వినియోగంలోకి తీసుకురావటంలో అధికారులు నిర్లక్ష్యం చూపటం రోగులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. టెక్నీషియన్‌ లేరని, నిర్వహణపై అవగాహన లేదనే కారణాలతో వాటిని పెట్టెల్లోనే అలా దాచి ఉంచారు.

నిర్వహణ చేయలేని పరిస్థితి

కర్నూలు జిల్లాలో చికిత్స పొందుతూ మరణించిన 389 మందిలో... ఆక్సిజన్‌ స్థాయి తగ్గి ప్రాణం విడిచినవాళ్లు ఎక్కువగా ఉందని వైద్యుల పరిశీలనలో తేలింది. ఈ సమస్య కేంద్రం దృష్టికి వెళ్లటంతో... పీఎం కేర్‌ కింద జిల్లాకు ఇప్పటివరకూ 333 వెంటిలేటర్లు అందించారు. కర్నూలు సర్వజన ఆసుపత్రికి 273, ఆదోని ఏరియా ఆసుపత్రికి 20, నంద్యాల వైద్యశాలకు 60 అందించారు. జీజీహెచ్​కి ఇచ్చిన వాటిలో ఎన్ని వినియోగంలో ఉన్నాయో తెలియని పరిస్థితి. ఆదోనిలో స్థలం, గదులు కేటాయించకపోవటం వల్ల వాటిని ఎక్కడ అమర్చాలో ఇంకా నిర్ణయించలేదు. నంద్యాలకు పంపించినవీ ఇంకా వినియోగంలోకి తేలేదు. అనస్థీషియా వైద్యులు, టెక్నీషియన్స్‌, నర్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో.. వెంటిలేటర్లు వినియోగింలోకి తెచ్చినా నిర్వహణ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావాలంటే ముందుగా టెక్నీషియన్స్‌, నర్సులను నియమించుకోవాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

కరోనా పరిస్థితుల్లోనూ వెంటిలేటర్లను అలా ఉంచడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. ఉన్న వనరులు సమర్థంగా వినియోగించటంపై అధికారులు దృష్టి పెట్టాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి

ఈజ్​ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో ఏపీ టాప్

ABOUT THE AUTHOR

...view details