ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: కరోనా భయంతో ఖాళీగా హైదరాబాద్‌ రహదారులు - amaravathi news

వాహనరాకపోకలతో ఎప్పుడు రద్దీగా కనిపించే హైదరాబాద్‌ మహానగర రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. అత్యంత రద్దీగా ఉండే కూడళ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. కరోనా భయంతో నగరవాసులు బయటకు రావడానికి బయపడుతున్నారు.

no traffic due to covid fear at many parts hyderabad
కరోనాతో ఖాళీగా దర్శనమిస్తున్న హైదరాబాద్‌ మహానగర రహదారులు

By

Published : Apr 18, 2021, 11:00 PM IST

కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో హైదరాబాద్​లోని రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. అవసరం ఉంటేనే బయటకు రావాలని వైద్యులు, అధికారులు హెచ్చరించటంతో బయటకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది.

తప్పనిసరి అయితే తప్ప బయటకు రావడం లేదు. ఎప్పుడూ ట్రాఫిక్​తో ఉండే తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, బీర్కేభవన్‌, అసెంబ్లీ, నాంపల్లి, లక్డీకపూల్‌, ఖైరతాబాద్‌, ఎర్రమంజిలి, పంజాగుట్ట కూడళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details