ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బోధనా రుసుముల చెల్లింపుల్లో జాప్యం.. విద్యార్థుల అవస్థలు

వృత్తి విద్య, డిగ్రీ చదివే విద్యార్థులకు ఉపకారవేతనాలు, బోధనారుసుముల విడుదలలో తీవ్రజాప్యం జరుగుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే సమయం దగ్గర పడుతున్నా.. గతేడాది బకాయిలు ఇంతవరకు పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. ఈ ఏడాదికి సంబంధించిన నిధుల కోసం కూడా విద్యార్థులు నిరీక్షిస్తోన్నారు. మరో రెండు నెలల్లో విద్యాసంవత్సరం పూర్తి కానుండడంతో..నిధుల విడుదలపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

By

Published : Feb 20, 2020, 6:51 AM IST

no scholar ships to students on andhra pradesh
బోధనా రుసుముల చెల్లింపుల్లో జాప్యం

ఉపకారవేతనాలు, బోధనారుసుముల చెల్లింపుల్లో ప్రభుత్వ జాప్యంతో..విద్యార్థులు అవస్థలు పడుతోన్నారు. కన్వీనర్‌ కోటా కింద ఏటా 2 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, వృత్తివిద్యా కోర్సుల్లో చేరుతారు. ప్రభుత్వం సకాలంలో బోధనా రుసుములు విడుదల చేయకపోవడంతో.... ఆ బకాయిలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. గతేడాదికి సంబంధించి రూ.2,399 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేయగా.... నవంబర్‌లో కొంత మేర విడుదల చేశారు. ఇంకా రూ. 1,005 కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాదికి సంబంధించి రూపాయి కూడా విడుదల కాలేదు. బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. కొన్ని కళాశాలలు రుసుములు చెల్లించాలని తమపై ఒత్తిడి తెస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. లేనిపక్షంలో ధ్రువపత్రాలను ఇవ్వమని బెదిరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగిన తర్వాత తిరిగి మీ ఖాతాల్లో జమచేస్తామంటున్నాయని అంటున్నారు.

ఈ విద్యా సంవత్సరం వృత్తి విద్యా కోర్సుల రుసుములపై.. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కమిషన్‌ రుసుములను ఖరారు చేస్తేనే చెల్లింపులకు ఆస్కారం ఉంటుంది. వాస్తవంగా డిసెంబర్‌ నాటికి ఖరారు కావాల్సి ఉండగా.. ఇంకా నివేదిక అందించలేదు. ఈ జాప్యం బోధనా రుసుముల చెల్లింపులపై పడుతోంది. మరో రెండున్నర నెలల కాలంలో విద్యా సంవత్సరం పూర్తికానుండడంతో నిధుల విడుదలపై..... విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సకాలంలో చెల్లింపులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

బోధనా రుసుముల చెల్లింపుల్లో జాప్యం

ఇదీ చదవండి: విలువలు.. విశ్వసనీయతే మా బలం: బృహతి చెరుకూరి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details