ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

167 మంది తహసీల్దార్లకు ఆరు నెలలుగా జీతాల్లేవ్: బొప్పరాజు - Bopparaju Venkateshwarlu Latest News

రెవెన్యూ శాఖలో ఇటీవల పదోన్నతి పొందిన సుమారు 167 మంది అధికారులకు జీతాలు ఇవ్వడం లేదని... రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. సీఎం జగన్ జోక్యం చేసుకొని... జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బొప్పరాజు వెంకటేశ్వర్లు
బొప్పరాజు వెంకటేశ్వర్లు

By

Published : Apr 10, 2021, 1:35 PM IST

బొప్పరాజు వెంకటేశ్వర్లు

డిప్యూటీ తహసీల్దార్ల నుంచి తహసీల్దార్లుగా పదోన్నతులు పొందిన సుమారు 167 మందికి... 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్లతో పాటు బదిలీ అయిన మరో 183 మంది సిబ్బందికి జీతాల్లేవని వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌ జోక్యం చేసుకుని... ఆయా సిబ్బందికి జీతాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details