ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ-కుబేర్​కు చేరని బిల్లులు...ఆందోళనలో ఉద్యోగులు, పింఛనుదారులు - ఉద్యోగులకు చేరని జీతాలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫించన్​దారులకు జూన్ నెల జీతాలు, పింఛన్లు ఇంకా అందలేదు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిన తర్యాత కూడా ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో ఉద్యోగులు, పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు.

no salaries and pensions were credited to job holders and pensioners
ఈ-కుబేర్​కు చేరని బిల్లులు

By

Published : Jul 7, 2020, 11:45 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫించన్​దారులకు జూన్ నెల జీతాలు, పింఛన్లు ఇంకా అందలేదు. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించకపోవటంతో కొంత ఆలస్యమైంది. తాజాగా 14రోజుల గడువు దాటి బిల్లు ఆమోదం పొందిన తర్యాత కూడా ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో ఉద్యోగులు, పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు.

సోమవారం జీతాలు అందుతాయని ఆశించినా ఖాతాల్లో ఇంకా సొమ్ములు జమ కాకపోవటంతో సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. గురువారం రాత్రికే బడ్జెట్​కు గవర్నర్ ఆమోదముద్ర పడి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇతరత్రా కార్యకలాపాలు పూర్తి చేసుకుని సోమవారం నాటికి జీతాలు అందిస్తారని ఉద్యోగులు ఎదురుచూశారు. సోమవారం మధ్యాహ్నానికి జీతాలు, పింఛన్ల బిల్లులు రిజర్వు బ్యాంకు ఈ-కుబేర్ చేరలేదు. ఆయా శాఖల బడ్జెట్​ను సీఎఫ్ఎంఎస్​లో అప్​లోడ్ చేస్తున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

సాంకేతిక కారణాల వల్లే ఆలస్యం

రాష్ట్రంలో 183మంది విభాగాధిపతులు, వారి ఆధ్వర్యంలో 27వేల మంది డ్రాయింగ్ డిస్బర్స్​మెంట్ అధికారులు ఉన్నారని, ఆయా ఖాతాలకు బడ్జెట్​ అప్​లోడ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక కారణాల వల్లే ఆలస్యమవుతోందంటున్నారు. అయితే బడ్జెట్​ ఆమోదం పొంది మూడు రోజులు గడిచినా ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం విమర్శలను ఎదుర్కొంటోంది. బడ్జెట్ విభాగం నుంచి సీఎఫ్​ఎంఎస్​కు వచ్చిన తర్వాత ప్రక్రియ సాగుతోందని అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా ఈ-కుబేర్​కు పంపే ఏర్పాట్లలో ఉన్నామని... మంగళవారం సాయంత్రానికి జీతాలు, పింఛన్లు అందుతాయని ఖజానాశాఖ సంచాలకుడు హన్మంతరావు చెప్పారు.

ఇదీ చదవండి:

ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్​లో 55 పోస్టుల నియామకానికి అనుమతులు

ABOUT THE AUTHOR

...view details