కరోనా విజృంభణ దృష్ట్యా వైద్య విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా బోధన జరుగుతోంది. అయితే వైద్య విద్యలో క్లినికల్ తరగతులు చాలా కీలకం. సాధారణ రోజుల్లో నేరుగా సంబంధిత రోగుల వద్దకు వెళ్లి వారిని పరీక్షించి రోగ లక్షణాలు, ఏ విధంగా చికిత్స చేయాలో ప్రొఫెసర్ల ద్వారా తెలుసుకుంటారు. కరోనా క్రమంలో క్లినికల్ తరగతులను సైతం ఆన్లైన్లో బోధిస్తున్నారు. అయితే దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు.. ప్రత్యక్షంగా రోగిని పరీక్షించడం ద్వారా పూర్తిస్థాయిలో అర్థమవుతుందని చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా ఇది కష్టసాధ్యమవుతోందని అంటున్నారు.
- ఆస్కీ విధానంలో బోధిస్తున్నాం
క్లినికల్ తరగతులను విద్యార్థులకు అర్థమయ్యేలా ఆబ్జక్టివ్ స్ట్రక్చరల్ క్లినికల్ ఎగ్జామినేషన్(ఆస్కీ) విధానంలో బోధిస్తున్నామని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్ చెబుతున్నారు. ఈ విధానంలో రోగి ఎదురుగా ఉన్నట్లే ఉంటుందని.. విద్యార్థులకు స్పష్టంగా అర్థమవుతుందని అంటున్నారు.
- పరీక్షలూ ఆన్లైన్లోనే
ప్రస్తుతం పీజీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు గూగుల్ రూం ద్వారా విద్యా బోధన జరుగుతోందని అధికారులు చెపుతున్నారు. వీరికి వార్షిక పరీక్షలు ఆగస్టులో జరుగుతాయి. కొవిడ్ దృష్ట్యా ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయని.. పరీక్షలు నిష్పాక్షికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. అయితే తక్కువగా ఉన్న పీజీ వైద్య విద్యార్థులకు కళాశాలల్లో పరీక్షలు నిర్వహించేలా యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
- క్లినికల్పై దృష్టి పెట్టాలి