లాక్‌డౌన్‌తో ఖాళీగా ఉండలేక.. లాక్‌డౌన్‌తో చాలామంది ఇళ్లల్లో ఖాళీగా ఉంటున్నారు. దీంతో తమ ఇళ్ల చుట్టుపక్కలవారు అంతా ఒక దగ్గర చేరి రకరకాల ఆటలు ఆడుతున్నారు. క్యారమ్స్, చెస్, హౌస్సీ, అష్టాచమ్మా, పేకాట ఇతర ఆటల్లో మునిగి తేలుతున్నారు. ఒకేచోట ఐదు, పదిమంది చేరి సరదాగా గడుపుతున్నారు. అయితే ఈ సరదా మాటున కరోనా దాగి ఉందని వారికి తెలియకుండానే వైరస్ బారిన పడుతున్నారు. ఒక్కరికి వైరస్ ఉన్నా ఆడుతున్న అదరికీ సోకుతోంది. పేకాటలో ముక్కలు అందరి చేతులు మారుతుంటాయి. క్యారమ్స్‌లో కూడా కాయిన్లు, స్ట్రైకర్.. ఒకరి నుంచి ఒకరి చేతికి వెళతాయి. చెస్, హౌస్సీలో కూడా ఇలానే అందరూ చేతులు కలుపుతుంటారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాక ఈ ఆటలు ఆడే వారంతా దగ్గరగా అడుగులోపే కూర్చుంటారు. వైరస్ ఉన్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లు అక్కడున్న కొందరిపై పడతాయి. లేదా ఆట వస్తువులపై పడినా.. వాటిని ఎవరైనా పట్టుకున్నా వారికీ వైరస్ అంటుకుంటుంది. అందుకే కొంతకాలంపాటు ఇలాంటి బృంద ఆటలకు దూరంగా ఉండటం మేలు. ఒకవేళ ఆడుకోవాలంటే కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం కావాలని చెబుతున్నారు.
వ్యాయామాలు తప్పనిసరి