ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

No Permission: అమరావతి ఉద్యమానికి రేపటితో 600 రోజులు.. ర్యాలీకి అనుమతించని పోలీసులు - రేపటితో 600రోజుకు ఉద్యమం

అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం రేపటితో 600వ రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా అమరావతి నుంచి మంగళగిరి వరకు రైతులు ర్యాలీ చేసేందుకు సంకల్పించారు. ఇందుకు అనుమతి లేదని తుళ్లూరు పోలీసులు ప్రకటించారు.

no permission
no permission

By

Published : Aug 7, 2021, 11:40 AM IST

అమరావతి రైతులు తలపెట్టిన రేపటి ర్యాలీకి.. పోలీసులు అనుమతి నిరాకరించారు. రాజధాని పరిరక్షణ పేరిట అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం.. ఆదివారంతో 600వ రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా.. రాజధాని నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు. స్పందించిన తుళ్లూరు పోలీసులు.. అనుమతి లేదని తేల్చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించారు. తుళ్లూరు సీఐ పేరిట ఈ మేరకు ప్రకటన జారీ అయ్యింది.

ABOUT THE AUTHOR

...view details