రాజధానుల అంశాన్ని అమరావతి ఐకాస నేతలు కొందరు దిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్ ప్రాంగణంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిలను కలిసిన రైతులు... తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. దానికి వారు సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు. పార్లమెంట్‌లో తమ సమస్యను లేవనెత్తుతామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. అనంతరం భాజపా ఎంపీ సుజనా చౌదరితో అమరావతి ఐకాస నేతలు భేటీ అయ్యారు. అమరావతిని ఎవరూ ఒక్క అంగుళమూ తరలించలేరని సుజనాచౌదరి అన్నారు. సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. రాజధాని విషయమై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని మంగళవారం రైతులు కలవనున్నారు.
అమరావతిని ఒక్క అంగుళమూ తరలించలేరు: సుజనా - ఏపీ రాజధాని మార్పు
అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చూడాలని రాజధాని ప్రాంత రైతులు దిల్లీలోని కేంద్ర పెద్దలకు వినతిపత్రం అందజేశారు. భాజపా ఎంపీ సుజనా చౌదరితోనూ భేటీ అయ్యారు. అమరావతిని ఎవరూ ఒక్క అంగుళమూ తరలించలేరని సుజనా అన్నారు.
sujana chowdary