ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రఘురామ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదు: సజ్జల - Sajjala Rama Krishna Reddy Latest News

రఘురామ విషయంలో ఎక్కడా ప్రభుత్వానికి సంబంధం లేదని... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రఘురామ వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. ఎంపీ రఘురామను వాడుకుని చంద్రబాబు కుట్ర చేశారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

By

Published : May 18, 2021, 7:20 PM IST

రఘురామ విషయంలో ఎక్కడా ప్రభుత్వానికి సంబంధం లేదని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎంపీ రఘురామ వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందన్న సజ్జల.. రఘురామను పావుగా వాడుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే యత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రఘురామను తెదేపా వాడుకుంటోందని ఆరోపించారు. ఎంపీ రఘురామను వాడుకుని చంద్రబాబు కుట్ర చేశారన్న సజ్జల.. రఘురామపై సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేసిందని వ్యాఖ్యానించారు.

రాజద్రోహం కేసు పెట్టడం చూడలేదని చంద్రబాబు అన్నారని.. చంద్రబాబు పాలనలో కేసీఆర్‌పై 12 రాజద్రోహం కేసులు పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. చంద్రబాబు హయాంలో అడ్వకేట్ల పైనా దేశద్రోహం కేసులు పెట్టారని గుర్తుచేశారు. బడ్జెట్ ఆమోదానికి శాసనసభను తప్పక సమావేశపరచాలని సజ్జల స్పష్టం చేశారు. ఏం మాట్లాడలేకే అసెంబ్లీ సమావేశాలను తెదేపా బహిష్కరించిందని ఎద్దేవా చేశారు. శాసనసభకు వస్తే ప్రతిపక్షానికి ప్రజల్లో గౌరవం ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... రఘురామకృష్ణరాజుకు కొనసాగుతున్న వైద్యపరీక్షలు

ABOUT THE AUTHOR

...view details