జాతీయ పార్టీపై పెడతారంటూ జరుగుతున్న ప్రచారంపై తెరాస శాసనసభ పక్షంలో ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన తెరాస శాసనసభ పక్ష సమావేశం జరిగింది. నయా భారత్.. గియా భారత్ ఏదీ లేదని.. అలాంటి ప్రచారం నమ్మొద్దని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ తెలిపారు. దేశంలో రాజకీయ శూన్యత ఉన్నప్పటికీ.. ఇప్పుడే జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సమయం వచ్చినప్పుడు అందరితో చర్చించిన తర్వాతే.. ముందుకెళ్తానని కేసీఆర్ పేర్కొన్నారు.
మరోసారి దేశం దృష్టిని ఆకర్షిస్తాం
దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన రెవెన్యూ చట్టం రాబోతున్నదని ముఖ్యమంత్రి వివరించారు. బుధవారం సభలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలిపారు. కొత్త చట్టంతో తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. ఇది అమల్లోకి వస్తే... భూములపై దౌర్జన్యాలు ఉండబోవన్నారు. కొత్త చట్టాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకూల పవనాలు