రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 20 వరకు సెలవులు రద్దు చేస్తున్నట్లు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. ఆరోగ్యం అత్యవసర పరిస్థితప్ప, మిగిలిన టీచర్లంతా విధుల్లో ఉండాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు సెలవులు ప్రకటిస్తూ శనివారం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. సర్కారు తాజా ఉత్తర్వుల ప్రకారం.. మే 20 తర్వాతే టీచర్లకు సెలవులు అందుబాటులోకి రానున్నాయి. కొత్త విద్యాసంవత్సరం జులై 4 నుంచి ప్రారంభం కానుంది.
ప్రభుత్వ ఉపాధ్యాయలకు సెలవులు రద్దు! - ap teachers summer holidays
![ప్రభుత్వ ఉపాధ్యాయలకు సెలవులు రద్దు! ప్రభుత్వ ఉపాధ్యాయలకు సెలవులు రద్దు!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15105317-210-15105317-1650811456551.jpg)
ప్రభుత్వ ఉపాధ్యాయలకు సెలవులు రద్దు!
19:47 April 24
మే 20 వరకు సెలవులు రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్వులు
Last Updated : Apr 24, 2022, 9:11 PM IST