స్థానిక సంస్థల ఎన్నికలకు రాజధాని గ్రామాలు దూరం - స్థానిక సంస్థల ఎన్నికలకు రాజధాని గ్రామాలు దూరం
16:03 March 08
స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రాజధాని గ్రామాలను మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్‌గా.. ఇతర పురపాలికల్లో విలీనం చేసే దిశగా చర్యలు సాగుతున్నాయి. మంగళగిరి పురపాలికలో యర్రబాలెం, బేతపూడి, నవులూరును కలపాలని.. పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలో కలపాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకొచ్చింది. నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండ, తుళ్లూరు మండలంలోని గ్రామాలను అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ ఆదేశాల కారణంగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు తుళ్లూరు మండలం దూరంగా ఉండనుంది.
ఇవీ చదవండి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్తమానం అందించింది'
TAGGED:
no elections in amaravathi